5 రోజుల వరుస లాభాలకు యూనియన్‌ బ్యాంక్‌లో బ్రేక్‌

5 రోజుల వరుస లాభాలకు యూనియన్‌ బ్యాంక్‌లో బ్రేక్‌

పబ్లిక్ రంగ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సర నాల్గో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే నికర నష్టం రూ.3331.5 కోట్ల నుంచి రూ.2713 కోట్లకు తగ్గింది. గత ఏడాది డిసెంబర్‌ త్రైమాసికానికిగాను సంస్థ నికరలాభం రూ.574.58 కోట్లుగా ఉంది.

ఇక బ్యాంక్‌ ప్రొవిజన్స్‌ 3501.7 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల నిరర్ధక ఆస్తులు 14.98శాతం నుంచి 14.15శాతానికి, నికర నిరర్ధక ఆస్తులు 6.85 శాతం నుంచి 5.49శాతానికి దిగివచ్చాయి. ఇక బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.9621.01 కోట్ల నుంచి రూ.11306.99 కోట్లకు తగ్గింది. 

ఇక ఆర్థిక ఫలితాలు నిరాశపర్చడంతో ఇవాళ ఇంట్రాడేలో యూనియన్‌ బ్యాంక్‌ 6శాతం నష్టపోయి రూ.33.80కు పడిపోయింది. దీంతో 5 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడినట్లయింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లో ఈ స్టాక్‌ అత్యంత నిరుత్సాహకరంగా ట్రేడవుతోంది.