ఏషియన్‌ పెయింట్స్‌ను ఈ సమయంలో కొనొచ్చా..?

ఏషియన్‌ పెయింట్స్‌ను ఈ సమయంలో కొనొచ్చా..?

పెయింట్‌ తయారీ కంపెనీ ఏషియన్‌ పెయింట్స్‌ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో వాల్యూమ్స్‌లో ఒక అంకె స్థాయి వృద్ధిని నమోదు చేసింది. ఆదాయం 7శాతం, నికరలాభం 2.1శాతం క్షీణించింది. మార్జిన్స్‌ మాత్రం 17.8శాతం నుంచి 18.5శాతానికి పెరిగాయి. స్థూల మార్జిన్స్‌ 4శాతం పెరిగి 45.8 శాతానికి పెరిగాయి. ఇన్‌పుట్‌ కాస్ట్‌ తగ్గడం, ఇన్వెంటరీ లాభాలు భారీగా పెరగడం కంపెనీకి ప్లస్‌ పాయింట్‌గా మారింది.

ఈ సమయంలో వివిధ బ్రోకరేజీ కంపెనీలు ఏమంటున్నాయో ఒకసారి పరిశీలిస్తే మెజార్టీ సంస్థలు కొనుగోలును సిఫార్సు చేస్తున్నాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ CLSA ఈ స్టాక్‌కు ఔట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌నిచ్చింది. మరో బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌... BUY రేటింగ్‌ను కొనసాగిస్తూ టార్గెట్‌ ధరను రూ.2000కు పెంచింది. స్ట్రాంగ్‌ గ్రోత్‌, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ బలంగా ఉండటం, పోటీ మార్కెట్‌లో లీడర్‌గా ఉండటం ఈ కంపెనీకి ప్లస్‌ పాయింట్లను యూబీఎస్‌ అభిప్రాయపడింది. 

క్రెడిట్‌ సూయీ కూడా ఈ స్టాక్‌కు ఔట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌నిస్తూ టార్గెట్‌ ధర రూ.1850గా నిర్ణయించింది. మరోవైపు గోల్డ్‌మెన్‌ శాక్స్‌ మాత్రం ఈ స్టాక్‌కు దూరంగా ఉండటమే మంచిదని, ర్యాలీలో ఎగ్జిట్‌ అయితే బాగుంటుందని అభిప్రాయపడింది. రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌ రూ.1064కు పడిపోయే అవకాశముందని గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అంచనా వేస్తోంది.

Disclaimer : ఇవి వివిధ బ్రోకరేజీ సంస్థలకు చెందిన అంచనాలు మాత్రమే. profityourtrade.in వెబ్‌సైట్‌కు వీటితో ఎలాంటి సంబంధం  లేదని గమనించగలరు.