వరుసగా మూడో రోజూ మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ నష్టాలు

వరుసగా మూడో రోజూ మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ నష్టాలు

లార్జ్‌ ట్రేడ్‌తో వరుసగా మూడో రోజూ మెట్రో పోలిస్‌ హెల్త్‌కేర్‌ నష్టాల్లో ట్రేడవుతోంది. ఇంట్రాడేలో షేర్‌ 4.7శాతం నష్టపోయి డే కనిష్ట స్థాయి రూ.1382.1కి పడిపోయింది. ప్రస్తుతం షేర్‌ దాదాపు రెండున్నర శాతం నష్టంతో రూ.1415 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి 46.25 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీలో సింగిల్‌ లార్జ్‌ ట్రేడ్‌ ద్వారా 30.5 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఇది మొత్తం ఈక్విటీలో 6శాతం కావడం విశేషం. ఇక సెకండరీ ప్లేస్‌మెంట్‌ ద్వారా 23.4 లక్షల షేర్ల(4.6శాతం వాటా)ను విక్రయానికి ఉంచినట్టు ప్రమోటర్‌ గ్రూప్‌ తెలిపింది. మంగళవారం ముగింపు ధరతో పోలిస్తే 10.5శాతం డిస్కౌంట్‌తో ఫ్లోర్‌ ధరను ఒక్కో షేరుకు రూ.1300గా నిర్ణయించారు. ఈ వాటా విక్రయం తర్వాత మెట్రో పోలిస్‌ హెల్త్‌కేర్‌లో ప్రమోటర్ల వాటా 56.9 శాతం నుంచి 52.31శాతానికి తగ్గనుంది.