కోల్గేట్‌ పామోలివ్‌కు BUY రేటింగ్‌.. ఎందుకంటే?

కోల్గేట్‌ పామోలివ్‌కు BUY రేటింగ్‌.. ఎందుకంటే?

ప్రముఖ ఓరల్‌ హెల్త్‌కేర్‌ బ్రాండ్‌ కోల్గేట్‌ పామోలివ్‌కు బ్రోకరేజీ సంస్థ నోమురా BUY రేటింగ్‌నిచ్చింది. ఈ స్టాక్‌కు అప్‌సైడ్‌లో 18శాతం పెరిగే అవకాశాలున్నాయని, టార్గెట్‌ ధర రూ.1620గా కంపెనీ అంచనా వేసింది. వినియోగదారుల ప్రవర్తనలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ కంపెనీ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తోందని, రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌ చక్కని రిటర్న్స్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉందని నోమురా అంచనా వేసింది. 

నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లో ఈ కంపెనీ టాప్‌ పెర్ఫామర్‌గా ఉంది. స్థిరమైన విభాగాల్లో ఈ కంపెనీ చక్కని ప్రదర్శనను నమోదు చేస్తోందని నోమురా అభిప్రాయపడింది. FY21, FY22,  FY23లో కంపెనీ 8శాతం, 15శాతం, 15శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని నోమురా అంచనా వేస్తోంది. 

ఇక కోల్గేట్‌ పామోలివ్‌ వరుసగా ఐదో రోజూ లాభపడింది. ఇవాళ ఇంట్రాడేలో షేర్‌ 3.2శాతం లాభపడి రూ.1421కు చేరింది. ఇంట్రాడేలో షేర్ 2 నెలల గరిష్టానికి చేరింది. ఈ నెల్లో ఇంట్రాడేలో ఈషేర్‌ ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. అలాగే వరుసగా 5 రోజుల ర్యాలీ కొనసాగడం గత 5 నెలల్లో ఇదే మొదటిసారి. చివరకు 2శాతం పైగా లాభంతో రూ.1408 వద్ద ఇవాల్టి ట్రేడింగ్ ను ముగించింది.