3 రోజుల్లోనే 54శాతం రిటర్న్స్‌... ఆ స్టాక్‌ ఏంటో తెలుసా?

3 రోజుల్లోనే 54శాతం రిటర్న్స్‌... ఆ స్టాక్‌ ఏంటో తెలుసా?

వరుసగా మూడో రోజూ లాభాల్లో కొనసాగుతూ నిఫ్టీ-500 ఇండెక్స్‌లో టాప్‌ పెర్ఫామర్‌గా వేగంగా దూసుకుపోతోంది ఇండియా బుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌. కేవలం 3 రోజుల్లోనే ఈ స్టాక్‌ 54శాతం రిటర్న్స్‌ అందించి ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తింది. ఇవాళ ఇంట్రాడేలో 23.6 శాతం లాభపడి రూ.251.55 స్థాయికి చేరింది. ఇది 3 నెలల గరిష్ట స్థాయి కావడం విశేషం. 

శుక్రవారం రోజూ 31.1 శాతం రిటర్న్స్‌ అందించిన ఈ స్టాక్‌ ఇవాళ కూడా అదే జోరును కొనసాగిస్తోంది. గత 2 నెలల్లో ఈ స్టాక్‌లో భారీగా రిటర్న్స్‌ రావడం ఇదే తొలిసారి. ఇక వాల్యూమ్స్‌ కూడా మెరుగ్గా ఉన్నాయి. 30 రోజుల సగటుతో పోలిస్తే వాల్యూమ్స్‌ 2.4 రెట్లు అధికంగా నమోదయ్యాయి. 

ఇండియా బుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌ ప్రస్తుతం 14శాతం లాభంతో రూ.232.20 వద్ద ట్రేడవుతోంది. 200 రోజుల సగటు కదలిక స్థాయి రూ.240కి సమీపంలో ప్రస్తుతం షేర్‌ కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 20న రూ.81కి పడిపోయి 52వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ స్టాక్‌... ప్రస్తుతం ఆ స్థాయి నుంచి మూడు రెట్లు పెరిగింది. 

షేర్‌ విలువ ఎందుకు పెరిగిందంటే..?
శుక్రవారం సెషన్‌లో ప్రముఖ ఇన్వెస్టర్‌ మోర్గాన్‌ స్టాన్లే ఏషియా ఒక్కో షేరు రూ.184.8 చొప్పున 45.2 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. ఇది మొత్తం ఈక్విటీలో 1.1శాతం వాటా కావడం విశేషం.