మళ్ళీ బుల్‌ పరుగు

మళ్ళీ బుల్‌ పరుగు

ఆసియా మార్కెట్ల సపోర్ట్‌తో ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. హెవీ వెయిట్‌ స్టాక్స్‌కు కొనుగోళ్ళ మద్దతు లభించడంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 318 పాయింట్ల లాభంతో 34,298 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 10129 వద్ద కొనసాగుతోన్నాయి. వరుసగా ఆరు వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఆరో మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ రావడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల్లో కొనసాగుతోంది. టెక్నాలజీ మినహా అన్నిరంగాల కౌంటర్లు లాభాల్లో ట్రేడవుతోన్నాయి. 

భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వొడాఫోన్‌ ఐడియా, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. టాటా మోటార్స్‌ 4.47 శాతం, టాటా స్టీల్‌ 3.41 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 3.05 శాతం, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 2.92 శాతం, హిందాల్కో 2.52 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. టీసీఎస్‌ 1.32 శాతం, బీపీసీఎల్‌ 0.77 శాతం, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ 0.50 శాతం, బ్రిటానియా 0.24 శాతం, హెచ్‌యూఎల్‌ 0.17 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.