ముచ్చటగా మూడోరోజూ వీఎస్‌టీ టిల్లర్స్‌ జోరు

ముచ్చటగా మూడోరోజూ వీఎస్‌టీ టిల్లర్స్‌ జోరు

అమ్మకాలు మెరుగ్గా ఉండటంతో వీఎస్‌టీ టిల్లర్స్‌ దూసుకుపోతోంది. గత 3 రోజుల్లో ఈ షేర్‌ 41శాతం లాభపడి ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తింది. The company's total sales during the reported month increased 23 per cent YoY to 2,389 unitsఇవాళ కూడా షేర్‌ ఇంట్రాడేలో 18శాతం పైగా లాభపడి డే గరిష్ట స్థాయి 1310కి చేరింది. ప్రస్తుతం 14శాతం పైగా లాభంతో రూ.1260 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. వాల్యూమ్స్‌ విషయానికి వస్తే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి 2 లక్షలకు పైగా షేర్లు ట్రేడయ్యాయి.

గత మంగళవారం కనిష్ట స్థాయి రూ.919 నుంచి ఈ షేర్‌ 41శాతం పెరిగి ఇంట్రాడేలో రూ.1300 మార్కును అధిగమించింది. ఇదే జోరుకొనసాగితే మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 7న నమోదు చేసిన 52వారాల గరిష్ట స్థాయికి రూ.1414ను అధిగమించే అవకాశాలున్నాయి. ఇక సేల్స్‌ విషయానికి వస్తే గత నెల్లో వీఎస్‌టీ టిల్లర్స్‌ 23శాతం వృద్ధితో 633 ట్రాక్టర్లను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 527 యూనిట్లుగా ఉన్నాయి.