ఐఓసీలో 9 రోజుల ర్యాలీకి బ్రేక్‌

ఐఓసీలో 9 రోజుల ర్యాలీకి బ్రేక్‌

దేశంలోని అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో బ్లాక్‌ డీల్‌ జరిగింది. దీంతో చివరి 30 నిమిషాల్లో 93 లక్షలకు పైగా షేర్లు చేతులు మారాయి. మొదటి ట్రేడ్‌లో 40.27 లక్షల షేర్లు, రెండో ట్రేడ్‌లో 22 లక్షల షేర్లు, మూడో ట్రేడ్‌లో 31.3 లక్షల షేర్లు చేతులు మారాయి. బయ్యర్స్‌, సెల్లర్స్‌కు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

లార్జ్‌ డీల్‌ జరగడంతో ఐఓసీలో 9 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. ఇంట్రాడేలో షేర్‌ 3శాతం పైగా నష్టపోయి డే కనిష్ట స్థాయి రూ.84.10కు పడిపోయింది. ప్రస్తుతం ఒకటిన్నర శాతం నష్టంతో రూ.85.65 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి ఇప్పటివరకు 2.64 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విషయానికి వస్తే రూ.79,314.29 కోట్లుగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 20.18 కాగా కంపెనీ పీ/ఈ 6.3గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.115.67, ఈపీఎస్‌ 13.38గా ఉంది.