హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌లో 5 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌

హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌లో 5 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌

గత 5రోజులుగా జోరుమీదున్న హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌కు ఇవాళ బ్రేక్‌పడింది. ఇవాళ ఇంట్రాడేలో 4శాతం లాభపడిన హెడెల్‌బర్గ్‌ సిమెంట్ డే కనిష్ట స్థాయి రూ.165.3కు పడిపోయింది. ప్రస్తుతం 2శాతం పైగా నష్టంతో రూ.167.55 వద్ద షేర్‌ ట్రేడవుతోంది.HEIDELBERG CEMENT OPC-43, 50kg, Rs 300 /bag K. V. I. International ... బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి ఇప్పటివరకు 1.90 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

కంపెనీ ఏం చెప్పిందంటే..?
ప్రస్తుతం ప్లైయాష్‌కు కొరత ఉందని ఇతర విద్యుత్‌ ప్లాంట్‌ల నుంచి దీనిని సేకరిస్తున్నట్టు తెలిపింది. లాక్‌డౌన్‌ తమ ఉత్పత్తిపై ప్రభావితం చూపిందని వెల్లడించింది. ట్రక్‌ డైవర్లు తక్కువగా ఉండటంతో భవిష్యత్‌లో ఈ అంశం తమపై ప్రభావం చూపే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. అలాగే వలస కూలీలు సొంతప్రాంతానికి వెళ్ళడంతో పట్టణ ప్రాంతాల్లో కార్మికుల కొరత ఎక్కువగా ఉందని, దీంతో సమీప భవిష్యత్‌లో సిమెంట్‌ డిమాండ్‌ తగ్గిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే మౌలిక, నిర్మాణ రంగంపై ప్రభుత్వ కేటాయింపులు మెరుగ్గా ఉంటే మళ్ళీ సిమెంట్‌ రంగానికి పూర్వ వైభవం వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది.