వీల్స్‌ ఇండియా రయ్‌ రయ్‌..

వీల్స్‌ ఇండియా రయ్‌ రయ్‌..

లార్జ్‌డీల్‌తో వీల్స్‌ ఇండియా రయ్‌మంటూ దూసుకుపోతోంది. లార్జ్‌ డీల్‌ రూపంలో మొత్తం ఈక్విటీలో 4.98 శాతం అంటే 12 లక్షల షేర్లు చేతులు మారడంతో వీల్స్‌ఇండియా ఇంట్రాడేలో దాదాపు 13శాతం లాభపడింది. వీల్స్‌ ఇండియాలో ఉన్న టైటాన్‌ యూకే యూరోప్‌ వాటాను సుందరం ఫైనాన్స్‌ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు ముందు వీల్స్‌ ఇండియాలో సుందరం ఫైనాన్స్‌కు 13.58 శాతం వాటా ఉంది. తాజా కొనుగోలుతో వీల్స్‌ ఇండియాలో సుందరం ఫైనాన్స్‌ వాటా 18.57 శాతానికి పెరిగింది.

ప్రస్తుతం వీల్స్‌ ఇండియా 8శాతం పైగా లాభంతో రూ.462.25 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 12.21 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1039.59 కోట్లుగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 11.48తో పోలిస్తే కంపెనీ పీ/ఈ కాస్త ఎక్కువగా అంటే 14.98గా ఉంది. ఇక కంపెనీ బుక్‌ వేల్యూ రూ.236.29, ఈపీఎస్‌ రూ.28.75గా ఉంది.