నష్టాల నుంచి లాభాల్లోకి..

నష్టాల నుంచి లాభాల్లోకి..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం లాభాల బాటలోకి మళ్ళాయి. ఆసియా మార్కెట్ల సపోర్ట్‌తో దేశీయ మార్కెట్లకు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. ఇవాళ జరగాల్సిన ఒపెక్‌ దేశాల సమావేశం వాయిదా పడటం, చమురు ఉత్పత్తి తగ్గింపునకు రష్యా ససేమిరా అనడం మన మార్కెట్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో ప్రస్తుతం నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 10,096 వద్ద, సెన్సెక్స్‌ 114 పాయింట్ల లాభంతో 34,223 వద్ద ట్రేడవుతోన్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో 21వేల మార్కును అధిగమించిన బ్యాంక్‌ నిఫ్టీ ప్రస్తుతం ఆ స్థాయి దిగువకు పడిపోయింది.  కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ మినహా అన్ని రంగాల కౌంటర్లకు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది.

బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. టెక్‌ మహీంద్రా 2.55 శాతం, వేదాంతా 2.33 శాతం, యూపీఎల్‌ 2.24 శాతం, సిప్లా 1.79 శాతం, సన్‌ఫార్మా 2.22 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. టైటాన్‌ 3.18  శాతం, ఐఓసీ 1.49 శాతం, టెక్‌ మహీంద్రా 1.32 శాతం, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 1.05 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 1.10 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌లూజర్స్‌గా ఉన్నాయి.