బిలియన్ డాలర్ బిజినెస్సే మా లక్ష్యం: సైయంట్

బిలియన్ డాలర్ బిజినెస్సే మా లక్ష్యం: సైయంట్

సైయంట్ టెక్నాలజీస్ వచ్చే నాలుగేళ్లలో బిలియన్ డాలర్ కంపెనీగా ఎదగడం టార్గెట్ గా పెట్టుకుంది. ఆ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఫౌండర్ బివిఆర్ మోహన్ రెడ్డి తన అభిప్రాయాలు మీడియాతో పంచుకున్నారు.ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ డాటా ఎనలిటిక్స్, నెట్‌వర్క్స్‌ లో సైయెంట్ సంస్థను అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.1991లో ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్ గా కేవలం ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి 13,200 ఉద్యోగులను నియమించుకుని కలాపాలు సాగిస్తుంది. సంస్థ ప్రారంభమై పాతికేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఉత్సవాలు చేసుకుంటోంది.ఈ సందర్భంగా బివిఆర్ తమ సంస్థకి  21 దేశాల్లో మొత్తం 38 లొకేషన్స్ లో తమకు ఆఫీసులున్నాయని చెప్పారుMost Popular