హైదరాబాద్ లో జర్మనీ జెడ్ఎఫ్ కంపెనీ యూనిట్

హైదరాబాద్ లో జర్మనీ జెడ్ఎఫ్ కంపెనీ యూనిట్

జర్మనీ కి చెందిన కార్ల విడిభాగాల తయారీ కంపెనీ జెడ్ఎఫ్ గ్రూప్ రాష్ట్రంలో  యూనిట్ స్థాపనకు ముందుకొచ్చింది. ఈమేరకు జడ్‌ఎఫ్ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఒప్పందంపై మాట్లాడుతూ కేటీఆర్  హైదరాబాద్ లో ఐటీ, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆటోమొబైల్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన అవకాశాలున్నాయని కేటీఆర్ తెలిపారు. సిటీలో తాము నెలకొల్పబోయే యూనిట్ లో ఇంజనీరింగ్ సర్వీసెస్ , ఆర్అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు జెడ్ఎఫ్ సంస్థ తెలిపింది. ఈ సంస్థకు అంతర్జాతీయంగా ఉన్న అన్ని డెవలప్‌మెంట్ టీమ్‌లకు ఈ సెంటర్ సేవలందించనున్నామని కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది.  2020కల్లా ఈ సెంటర్‌లో  పనిచేసే ఇంజినీర్ల సంఖ్య 2,500కు చేరుందని ఇండియా టెక్నాలజీ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మమతా చామర్తి తెలిపారు.Most Popular