ఏపిలో సొమానీ సిరామిక్స్ మేకింగ్ యూనిట్

ఏపిలో సొమానీ సిరామిక్స్ మేకింగ్ యూనిట్

సొమానీ సిరామిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఏపీలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు సొమానీ సిరామిక్స్ లిమిటెడ్ ఎండీ అభిషేక్ తెలిపారు. టైల్స్‌ అండ్‌ శానిటరీవేర్ బాత్ రూమ్ ఫిట్టింగ్స్ షోరూమ్ సొమానీ ను హైదరాబాద్ బంజారా హిల్స్ లో లాంఛ్ చేసిందీ సంస్థ. గతేడాది కంపెనీ టర్నోవర్ 1800 కోట్ల రూపాయలుగా ఉందని ఇందులో 5 శాతం అంటే 100 కోట్ల రూపాయలు ఎక్స్ పోర్ట్స్ నుంచి వస్తోందని అభిషేక్ తెలిపారు. దేశవ్యాప్తంగా తమకు 9000 రీటైల్ అవుట్ లెట్స్ ఉన్నాయని ఇందులో 200 ఎక్లూజివ్ షోరూమ్స్ అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా టైల్స్ మార్కెట్ 24 వేల కోట్ల రూపాయలైతే  అందులో  అన్ ఆర్గనైజ్డ్ మార్కెట్ వాటా 50శాతం ఉందని అన్నారు. టైల్స్ మార్కెట్ లో తమ మార్కెట్ వాటా 16 శాతం గా ఉంటుందని అభిషేక్ అంటున్నారు. సిరామిక్స్ బిజినెస్ కు జీఎస్‌టీ వరంగా మారనుందని అభిప్రాయపడ్డారాయన. ప్రస్తుతం ఉన్న విధానంలో 30 శాతం మేర పన్నులు కడుతున్నట్లు చెప్పారు. జిఎస్‌టి అమల్లోకి వస్తే తమ వ్యాపారం లాభపడటం ఖాయమన్నారుMost Popular