భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్‌తో ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆర్థిక రంగానికి తిరిగి పునరుత్తేజం కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు ప్రకటించవచ్చనే అంచనాలను ట్రేడింగ్‌ ఆసాంతం మార్కెట్లు అప్‌ట్రెండ్‌లో పయనించాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ ప్రకటించడం సెంటిమెంట్‌ను మరింత బలపర్చింది. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, బ్యాంకింగ్‌, మెటల్స్‌, ఆటో సూచీలు మార్కెట్లను లీడ్‌ చేశాయి. ట్రేడింగ్‌ మొత్తం మీద నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 9826 వద్ద, సెన్సెక్స్‌ 879 పాయింట్ల లాభంతో 33,304 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. ఇక ఒకదశలో 20వేల మార్కును అధిగమించిన బ్యాంక్‌ నిఫ్టీ... చివరకు ఆ స్థాయి దిగువన ముగిసింది. 

Nifty 50
9826.15    245.85    +2.57%
BSE Sensex
33303.52    879.42    +2.71%
Nifty Bank
19959.90    662.65    +3.43%
Nifty IT
14307.10    296.60    +2.12%
BSE SmallCap
11222.76    330.16    +3.03%
BSE MidCap
12157.40    314.18    +2.65%
Nifty Auto
6419.50    200.70    +3.23%
BSE Cap Goods
12467.89    133.91    +1.09%
BSE Cons Durable
20210.62    1244.08    +6.56%
BSE FMCG
11024.65    126.98    +1.17%
BSE Healthcare
15710.86    64.46    +0.41%
BSE Metals
7071.78    266.52    +3.92%
BSE Oil & Gas
11989.76    153.79    +1.30%
BSE Teck
7356.29    133.80    +1.85%
Nifty PSE
2412.60    43.60    +1.84%

బజాజ్ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 10.61 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 8.13 శాతం, టైటాన్‌ 7.74 శాతం, టాటా స్టీల్‌ 6.78 శాతం, ఎంఅండ్‌ఎం 5.67 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ 2.89 శాతం, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 2.48 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 2.28 శాతం, నెస్లే 2.04 శాతం, సన్‌ఫార్మా 1.87 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.