వరుసగా నాల్గోరోజూ పిరమాల్‌ జోరు

వరుసగా నాల్గోరోజూ పిరమాల్‌ జోరు

నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లో టాప్‌ పెర్ఫామర్‌గా పిరమాల్‌ కొనసాగుతోంది. ఇవాళ ఇంట్రాడేలో 11.7శాతం లాభంతో రూ.1081కి చేరింది. గత రెండు నెలల్లో సింగిల్‌ డేలో ఇదే అతిపెద్ద లాభం కావడం విశేషం. వరుసగా నాల్గోరోజూ లాభాల్లో కదలాడుతోన్న పిరమాల్‌ ప్రస్తుతం 3 నెలల గరిష్ట స్థాయి వద్ద కొనసాగుతోంది. 

చివరి 10 సెషన్స్‌లో ఈ స్టాక్ ఎనిమిదిసార్లు లాభాల్లోనే కదలాడింది. ఈ సమయంలో ఈ స్టాక్‌ 20శాతం పైగా లాభపడింది. 30 రోజుల సగటుతో పోలిస్తే వాల్యూమ్స్‌ 1.6 రెట్లు  పెరిగాయి. ఈ ఏడాది మార్చి 24న రూ.607కు పడిపోయిన 52వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన పిరమాల్‌ ప్రస్తుతం ఆ స్థాయికి 75శాతం ఎగువన ట్రేడవుతోంది. 

ప్రస్తుతం పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 10.6శాతం లాభంతో రూ.1073.25 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు 18.50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విషయానికి వస్తే రూ.23,947.66 కోట్లు, బుక్‌ వేల్యూ రూ.1003.29, ఈపీఎస్‌ రూ.6.62గా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 31.29తో పోలిస్తే కంపెనీ పీ/ఈ ఐదు రెట్ల(రూ.160.41)కు పైగా ఉంది.