నష్టాల్లో ట్రేడవుతోన్న దేశీయ మార్కెట్లు

నష్టాల్లో ట్రేడవుతోన్న దేశీయ మార్కెట్లు

ఐటీ, మెటల్‌ స్టాక్స్‌ భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 9450 దిగువన ప్రారంభం కాగా, ట్రేడింగ్‌ ఓపెనింగ్‌లోనే సైకలాజికల్‌ ఫిగర్‌ 32వేల దిగువకు సెన్సెక్స్‌ పడిపోయింది. యూఎస్‌-చైనా టెన్షన్స్‌,  గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్‌ లేకపోవడం, మార్కెట్లను ఉత్సాహపరిచే అంశాలేవీ లేకపోవడంతో జూన్‌ ఎఫ్‌అండ్‌ఓ సిరీస్‌ తొలిరోజూ మార్కెట్లు నెగిటివ్‌గా కదలాడుతోన్నాయి.  ప్రస్తుతం నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 9420 వద్ద, 267 పాయింట్ల నష్టంతో 31934 వద్ద ట్రేడవుతోన్నాయి. స్మాల్‌క్యాప్‌, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కౌంటర్లకు మాత్రమే కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. 

గూగుల్‌ పెట్టుబడులు పెట్టనుందనే వార్తలతో వొడాఫోన్‌ ఐడియా ఇవాళ దూసుకుపోతోంది. ప్రస్తుతం షేర్‌ 10శాతం పైగా లాభంతో కొనసాగుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసీం, సిప్లా, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1-3.50శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందాల్కో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌లు 1.7-2.5శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.