ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (మే 29)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (మే 29)

టీవీఎస్‌ మోటార్‌: క్యూ-4లో 43.3శాతం క్షీణతతో రూ.81.85 కోట్లుగా నమోదైన కంపెనీ నికరలాభం
ఫెడరల్‌ బ్యాంక్‌ : క్యూ-4లో 21శాతం క్షీణతతో రూ.301 కోట్లుగా నమోదైన ఫెడరల్‌ బ్యాంక్‌ నికరలాభం
NHPC: సౌర విద్యుత్తు వ్యాపారంలోకి ప్రవేశించాలన్న ప్రతిపాదనకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
వొడాఫోన్‌ ఐడియా : టెలికాం కంపెనీలో 5శాతం వాటాను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్న గూగుల్‌, ప్రారంభ దశలో చర్చలు
రెయిన్‌ ఇండస్ట్రీస్‌ : యూరోప్‌, నార్త్‌ అమెరికాల్లోని ప్లాంట్లలో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపిన రెయిన్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌
పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ : టెనాక్స్‌ ఇండియా స్టోన్‌ ప్రోడక్ట్స్‌లో 70శాతం వాటా కొనుగోలును పూర్తి చేసిన కంపెనీ
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కర్నాటక బ్యాంక్‌ : తమ మార్గదర్శకాలను అనుసరించనందుకు గాను రెండు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్‌బీఐ
టెక్స్‌మాకో ఇన్‌ఫ్రా : అంఫాన్‌ తుఫాన్‌తో కోల్‌కతాలోని ప్లాంట్‌లో వచ్చే 5-7 రోజుల వరకు ఉత్పత్తి నిలిపివేత
టాటా టెలిసర్వీసెస్‌ : జూన్‌ 2న జరిగే సమావేశంలో డెట్‌, ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో రూ.5వేల కోట్ల నిధుల సేకరణకు బోర్డు అనుమతించే అవకాశం
రేమాండ్‌ : ఈనెల 31న జరిగే సమావేశంలో రూ.80 కోట్ల ఎన్‌సీడీల జారీపై నిర్ణయం తీసుకోనున్న కంపెనీ బోర్డు
ఇవాళ ఆర్థిక ఫలితాలను ప్రకటించే కంపెనీలివే : పీఅండ్‌జీ హెల్త్‌, ఓల్టాస్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఆర్‌సీఎఫ్‌, వి-మార్ట్‌ రిటైల్‌, దిలిప్‌ బిల్డ్‌కాన్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌, లెమన్‌ ట్రీ, ఎన్‌సీసీ, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, సింఫని, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌