ఇసాబ్‌ ఇండియా మధ్యంతర డివిడెండ్‌

ఇసాబ్‌ ఇండియా మధ్యంతర డివిడెండ్‌

మధ్యంతర డివిడెండ్‌ ప్రకటనతో ఇవాళ ఇసాబ్‌ ఇండియా పరుగులు తీస్తోంది. ఇంట్రాడేలో ఈ స్టాక్‌ 12.50 శాతం పైగా లాభపడి డే గరిష్ట స్థాయి రూ.1232.90 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ళ మద్దతు లభిస్తుండడంతో Esab INDIA Ltd, Andheri East - Inverter Dealers in Mumbai - Justdialప్రస్తుతం షేర్‌ 12శాతం లాభంతో రూ.1223.50 వద్ద కొనసాగుతోంది. ఉదయం 11:43 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 62,500 షేర్లు ట్రేడయ్యాయి. 

గురువారం జరిగిన బోర్డు మీటింగ్‌లో డైరెక్టర్లు మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు సిఫార్సు చేశారు. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుపై 700 శాతం అంటే రూ.70 డివిడెండ్‌ను చెల్లించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ షార్ట్‌టర్మ్‌లో ఉన్నా... తమ ఉత్పత్తులకు సమీపకాలంలో చక్కని డిమాండ్‌ లభించవచ్చని ఇసాబ్‌ ఇండియా వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్లాంట్లలో 50శాతం నిర్వహణ సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు, రాబోయే రోజుల్లో ఉత్పత్తి తిరిగి 100 శాతానికి చేరుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.