అప్పును 3వారాల్లో చెల్లించాల్సిందే... అనిల్‌ అంబానీకి లండన్‌ కోర్టు ఆదేశం

అప్పును 3వారాల్లో చెల్లించాల్సిందే... అనిల్‌ అంబానీకి లండన్‌ కోర్టు ఆదేశం

అనిల్ అంబానీని వరుస కష్టాలు వెంటాడుతోన్నాయి. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అడాగ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ వచ్చే 3వారాల్లో భారీ మొత్తాన్ని చైనా బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. రుణ ఒప్పందంలో భాగంగా 3 చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.5446 కోట్ల (717 మిలియన్‌ డాలర్లు)ను వచ్చే 21 రోజుల్లో అనిల్ అంబానీ చెల్లించాల్సి ఉంది. అప్పు తీర్చేందుకు 3 వారాల గడువు ఇచ్చామని, వచ్చేనే పూర్తి రుణం చెల్లించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లండన్‌ కోర్టు హెచ్చరించింది. A spokesman for Anil Ambani said that other Reliance group operations will not be affected by the ruling. Reliance Communications filed for bankruptcy last year.

2012 ఫిబ్రవరి 3 చైనా బ్యాంకు(ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్-ముంబై బ్రాంచ్ చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా)ల నుంచి రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్ రూ.5446 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ రుణానికి అడాగ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ వ్యక్తిగత హామీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆర్‌కామ్‌ దివాళాలో ఉండటంతో తమ అప్పును వెంటనే చెల్లించాలని కోరుతూ లండన్‌ కోర్టును చైనా బ్యాంకులు ఆశ్రయించాయి. 

ఈ పిటిషన్‌ను స్వీకరించిన లండన్‌ కోర్డు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. పిటిషనర్‌ వాదనలపై సంతృప్తి వ్యక్తం చేసిన లండన్‌ కోర్టు జడ్జి జస్టిస్‌ నిగెల్‌ ... పూర్తి రుణమొత్తాన్ని 21 రోజుల్లో చెల్లించాలని అనిల్‌ అంబానీని ఆదేశించారు. రుణం తీసుకున్నప్పుడు అనిల్ అంబానీ హామీగా ఉన్నారని, ఇప్పుడు దానిని నిలబెట్లుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన తీర్పునిచ్చారు.