వరుసగా మూడోవారం కూడా నష్టాలే..!

వరుసగా మూడోవారం కూడా నష్టాలే..!

ఒకవైపు అమెరికా-చైనా ట్రేడర్‌ వార్‌, మరోవైపు ఇన్వెస్టర్లను నిరాశపర్చిన ఉద్దీపన ప్యాకేజీ... దీనికి తోడు ఆర్‌బీఐ కీలకరేట్ల తగ్గింపు అంచనాలను అందుకోలేకపోవడం దేశీయ మార్కెట్లను నిరాశపర్చాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 425 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈవారం బ్యాంకింగ్‌ స్టాక్స్‌కు పీడకలగా చెప్పొచ్చు. గ్లోబల్‌ మార్కెట్లతో నిమిత్తం లేకుండా, దేశీయ సూచీలు లాభాల్లో ఉన్పప్పటికీ బ్యాంకింగ్‌ స్టాక్స్‌ మాత్రం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెల్లింగ్‌ ప్రెజర్‌కు టాప్‌ బ్యాంక్స్‌ సైతం కుప్పకూలాయి. ఈవారం బ్యాంక్‌ నిఫ్టీ 8.26 శాతం అంటే 1555 పాయింట్లు నష్టపోయి 17279 వద్ద ముగిసింది. 

ఇతర స్టాక్స్‌లోఐటీ, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌కు మాత్రం ఈవారం కలిసివచ్చింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 76 మార్కును అధిగమించడం ఐటీ, టెక్నాలజీ స్టాక్స్‌కు బూస్టింగ్‌నిచ్చింది. ఇక మిగిలిన రంగాల వివరాలు దిగువ పట్టికలో చూడండి.

నిఫ్టీ వీక్లీ టాప్‌ గెయినర్స్‌ & లూజర్స్‌ : ఐటీసీ 13.21 శాతం, సిప్లా 12.07 శాతం, ఎంఅండ్‌ఎం 11.82 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 7.02 శాతం, టీసీఎస్‌ 6.64 శాతం, ఇన్ఫోసిస్‌ 6.12 శాతం, హిందాల్కో 4.70 శాతం, సన్‌ఫార్మా 4.62 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 4.30 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 4.13 శాతం లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 19.25 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 13.26 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 9.75 శాతం, ఎస్‌బీఐ 9.34 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 9.13 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 8.57 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 7.28 శాతం, ఎల్అండ్‌టీ 5.58 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 5.55 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4.51 శాతం నష్టంతో ఈవారం నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.