నష్టాల్లో ట్రేడవుతోన్న సూచీలు

నష్టాల్లో ట్రేడవుతోన్న సూచీలు

స్టాక్‌ మార్కెట్లో 3 రోజుల వరుస ర్యాలీకి ఇవాళ బ్రేక్‌ పడింది. ఆసియా మార్కెట్ల సపోర్ట్‌ లేకపోవడంతో దేశీయ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక ప్రకటన కోసం మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 30 పాయింట్లు, సెన్సెక్స్‌ 85 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం పైగా నష్టంతో 17618 వద్ద కొనసాగుతోంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రాలు 1-3శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. హిందాల్కో, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, గెయిల్‌, శ్రీ సిమెంట్స్‌లు 2-4శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతోన్నాయి. 
 T he Sensex was down 7.10 points or 0.02% at 30925.80, and the Nifty was down 10.35 points or 0.11% at 9095.90.