వడ్డీరేట్లు తగ్గనున్నాయా?

వడ్డీరేట్లు తగ్గనున్నాయా?

ఇవాళ ఉదయం 10గంటలకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక ప్రకటన చేయనున్నారు. కీలక వడ్డీరేట్లను అరశాతం తగ్గించవచ్చనే మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. రెపో రేటును 0.50శాతం, రివర్స్‌ రెపో రేటును 0.75 శాతం తగ్గించవచ్చనే అంచనాలున్నాయ. అలాగే మారటోరియం సంబంధించి మరొక మూడు నెలలు పొడగిస్తారా లేక రుణాల పునర్‌ వ్యవస్థీకరణ నిర్ణయం తీసుకుంటారా అనేది మరికాసేపట్లో తేలనుంది. నిరర్ధక ఆస్తుల వర్గీకరణకు సంబంధించి కూడా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకునే అవకాశముంది.