9100 ఎగువన ముగిసిన నిఫ్టీ

9100 ఎగువన ముగిసిన నిఫ్టీ

వరుసగా మూడోరోజూ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆటో, మెటల్స్‌, ఎఫ్‌ఎంసీజీ కౌంటర్లు మార్కెట్లను లీడ్‌ చేశాయి. మార్నింగ్‌ సెషన్‌లో మార్కెట్లను లీడ్‌ చేసిన బ్యాంకింగ్‌ షేర్లు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తికి లోనయ్యాయి. లాక్‌డౌన్‌ నుంచి కొన్ని రంగాలకు సడలింపులు ఇవ్వడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో ఇవాళ నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 9106 వద్ద, సెన్సెక్స్‌ 114 పాయింట్ల నష్టంతో 30933 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఐటీసీ 7.51 శాతం, హిందాల్కో 7.20 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 4.95 శాతం, హీరోమోటోకార్ప్ 4.74 శాతం, మారుతీ సుజుకీ 3.23 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.46 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.94శాతం, ఎన్టీపీసీ 2.85 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.57శాతం, అదాని పోర్ట్స్‌ 2.04శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో 1066 స్టాక్స్‌ లాభాల్లో, 666 స్టాక్స్‌ నష్టాల్లో ముగిశాయి. 

Nifty
9106.25    39.70    +0.44%

BSE Sensex
30932.90    114.29    +0.37%

Nifty Bank
17735.10    -105.10    -0.59%

Nifty IT
13647.90    130.50    +0.97%

BSE SmallCap
10548.13    75.76    +0.72%

BSE MidCap
11363.84    85.62    +0.76%

Nifty Auto
5749.90    146.10    +2.61%

BSE Cap Goods
11181.32    -118.12    -1.05%

BSE Cons Durable
18302.78    75.88    +0.42%

BSE FMCG
10359.21    179.38    +1.76%

BSE Healthcare
15452.05    98.48    +0.64%

BSE Metals
6317.81    114.29    +1.84%

BSE Oil & Gas
11129.29    78.03    +0.71%

BSE Teck
7148.93    64.32    +0.91%

Nifty PSE
2224.40    0.65    +0.03%