టాప్‌ గేర్‌లో బజాజ్‌ ఆటో

టాప్‌ గేర్‌లో బజాజ్‌ ఆటో

భారీ కొనుగోళ్ళ మద్దతుతో ఇవాళ బజాజ్ ఆటో జోరుమీదుంది. నిఫ్టీ-50లో బజాజ్‌ ఆటో టాప్‌ పెర్ఫామర్‌గా ఉంది. ఇంట్రాడేలో బజాజ్‌ ఆటో 6శాతం పైగా లాభపడి డే గరిష్ట స్థాయి రూ.2722.80కు చేరింది. ప్రస్తుతం 5శాతం పైగా లాభంతో రూ.2692వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఉదయం 9:35 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 9.30 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్‌ క్యాప్ రూ.74,021.53 కోట్లకు చేరింది. ఇండస్ట్రీ పీ/ఈ 14.56 కాగా, కంపెనీ పీ/ఈ 14.53గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.752.67, ఈపీఎస్‌ రూ.176.08గా ఉంది. 

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ ఉన్నప్పటికీ మార్చి త్రైమాసికంలో బజాజ్‌ ఆటో మెరుగైన ప్రదర్శనను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ద్విచక్ర వాహన అమ్మకాల్లో 15శాతం వృద్ధి నమోదైంది. అలాగే మొత్తం ఎగుమతులు 7శాతం పెరిగాయి. అయితే కంపెనీ నికరలాభం మాత్రం 8.2శాతం క్షీణతతో రూ.1310 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్స్‌ 16.5శాతం నుంచి 18.4శాతానికి పెరిగాయి. లాక్‌డౌన్‌తో తమ ప్లాంట్‌లు తెరిచిఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగలేదని కంపెనీ తెలిపింది.