వరుసగా మూడోరోజూ కొనసాగుతోన్న లాభాలు

వరుసగా మూడోరోజూ కొనసాగుతోన్న లాభాలు

ఇవాళ దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్‌ స్టాక్స్‌కు కొనుగోళ్ళ మద్దతు లభించడంతో వెంటనే సూచీలకు ఒక్కసారిగా కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌, నిఫ్టీలు అరశాతం పైగా లాభంతో ట్రేడవుతోన్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో, ఇవాళ వీక్లీ ఎక్స్‌పైరీ ఉండటంతో మార్కెట్లు ఒత్తిడికి లోనవుతోన్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 9115 వద్ద, సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 30978 వద్ద, బ్యాంక్‌ నిప్టీ 225 పాయింట్ల లాభంతో 18065 వద్ద కొనసాగుతోన్నాయి. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటోలు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. బజాజ్ ఆటో, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు 1.5-3.50శాతం లాభంతో నిప్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. శ్రీ సిమెంట్స్‌, అదాని పోర్ట్స్‌, గ్రాసీం, ఎన్టీపీసీ, ఎంఅండ్‌ఎంలు 0.50-2శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా కొనసాగుతోన్నాయి. 

Nifty IT
13541.50    24.10    +0.18%

BSE SmallCap
10536.13    63.76    +0.61%

BSE MidCap
11364.79    86.57    +0.77%

Nifty Auto
5655.35    51.55    +0.92%

BSE Cap Goods
11388.66    89.22    +0.79%

BSE Cons Durable
18385.27    158.37    +0.87%

BSE FMCG
10188.97    9.14    +0.09%

BSE Healthcare
15434.66    81.09    +0.53%

BSE Metals
6243.05    39.53    +0.64%

BSE Oil & Gas
11072.32    21.06    +0.19%

BSE Teck
7095.20    10.59    +0.15%

Nifty PSE
2225.55    1.80    +0.08%