రెండేళ్ళ కనిష్టానికి హావెల్స్‌ ఇండియా

రెండేళ్ళ కనిష్టానికి హావెల్స్‌ ఇండియా

వరుసగా ఐదో రోజూ హావెల్స్‌ ఇండియాలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. గత మూడు నెలల్లో వరుసగా ఇన్ని సెషన్లపాటు హావెల్స్‌ ఇండియా నష్టాల్లో కొనసాగడం ఇదే తొలిసారి. గత 5 సెషన్లుగా షేర్‌ 10శాతం నష్టపోయింది. 

వాల్యూమ్స్‌ విషయానికి వస్తే 30 రోజుల సగటుతో పోలిస్తే 3.5 రెట్లు పెరిగాయి. గత ఏడాది జూన్‌ 28న నమోదు చేసిన 52వారాల గరిష్ట స్థాయి రూ.806.90కు ప్రస్తుతం 50శాతం దిగువన ట్రేడవుతోంది. 

ప్రస్తుతం షేర్‌ ఒకటిన్నర శాతం పైగా నష్టంతో రూ.459.65 వద్ద కొనసాగుతోంది. ఇది 2017 ఆగస్ట్‌ కనిష్ట స్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం 12:52 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 48.50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

 ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.28,705.83 కోట్లకు చేరింది. ఇండస్ట్రీ పీ/ఈ 34.63 కాగా కంపెనీ పీ/ఈ 39.2గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.68.77, ఈపీఎస్‌ రూ.11.71గా ఉన్నాయి.