వరుసగా ఏడో రోజూ యునైటెడ్‌ స్పిరిట్స్‌ అదే జోరూ..

వరుసగా ఏడో రోజూ యునైటెడ్‌ స్పిరిట్స్‌ అదే జోరూ..

యునైటెడ్‌ స్పిరిట్స్‌లో జోరు కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజూ స్టాక్‌ 4శాతం పైగా లాభంతో డే గరిష్ట స్థాయి రూ.578 వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది జూలై తర్వాత వరుసగా ఎక్కువ రోజులు లాభాల్లో కొనసాగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం షేర్‌ 2 నెలల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతోంది. గత 7 సెషన్స్‌లో షేర్‌ 16శాతం పైగా లాభపడింది. ప్రస్తుతం దాదాపు 3శాతం లాభంతో రూ.570.45 వద్ద కొనసాగుతోంది.

30 రోజుల సగటుతో పోలిస్తే ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ 1.7 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం యునైటెడ్‌ స్పిరిట్స్‌ 100 రోజుల మూవింగ్‌ యావరేజీ రూ.579.8 సమీపంలో ట్రేడవుతోంది. కరోనా వైరస్‌తో స్టాక్‌ మార్కెట్లు డీలాపడటంతో ఈ ఏడాది మార్చి 25న యునైటెడ్‌ స్పిరిట్స్‌ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఆ స్థాయికి 29శాతం ఎగువన షేర్‌ ట్రేడవుతోంది. 

మధ్యాహ్నం 12:18 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 49.20 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఇక ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.40,986.06 కోట్లుగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 42.74 కాగా, కంపెనీ పీ/ఈ 50.78గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.43.10, ఈపీఎస్‌ రూ.11.11గా ఉంది.