రైట్స్ ఇష్యూతో రిలయన్స్‌లో జోరు

రైట్స్ ఇష్యూతో రిలయన్స్‌లో జోరు

రైట్స్‌ ఇష్యూ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో జోరు కనిపిస్తోంది. ప్రస్తుత షేర్‌హోల్డర్లకు ఇవాల్టి నుంచి సబ్‌స్కిప్షన్‌ ప్రారంభమైంది. ఇంట్రాడేలో 2శాతం పైగా లాభపడిన రిలయన్స్‌ డే గరిష్ట స్థాయి రూ.1445.85కు చేరింది. ప్రస్తుతం ఒకటిన్నర శాతం పైగా లాభంతో రూ.1432.55 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఉదయం 10:33 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 1.27 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. 

కంపైనీ ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే మార్కెట్‌ క్యాప్‌ రూ.952,195.30 కోట్లుగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 18.48 కాగా, కంపెనీ పీ/ఈ 30.83గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.706.46, ఈపీఎస్‌ రూ.45.7గా ఉంది. 

రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూకు సంబంధించిన వివరాలు..
ప్రారంభ తేదీ : మే 20, 2020
ముగింపు తేదీ : జూన్‌ 03, 2020
రూ.53వేల కోట్లకు పైగా నిధులను సేకరించేందుకు రైట్స్‌ ఇష్యూకు వస్తోన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
రైట్స్‌ ఇష్యూ కింద ప్రతి 15 రిలయన్స్‌ షేర్లకు ఒక షేరు చొప్పున జారీ 
రైట్స్‌ ఇష్యూ కింద జారీ చేసే ఒక్కో షేరు ధర రూ.1,257
రైట్స్‌ ఇష్యూలో దరఖాస్తు చేసుకునే షేర్లకు వాటాదారులు మొదట 25 శాతం(రూ.314.25) మాత్రమే చెల్లించాలి
మిగిలిన మొత్తాన్ని రెండు విడతల్లో చెల్లించే వెసులుబాటు
వచ్చే ఏడాది మే(రూ.314.25), నవంబర్‌(రూ.628.50)లో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి
ASBA, R-WAP ద్వారా సంస్థాగతేతర ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు
ఐపీఓ దరఖాస్తులాగే నెట్‌ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సంస్థాగతేతర ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు

R-WAP :  https://rights.kfintech.com లో రిజిస్టర్ చేసుకోవాలి.
ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు చేయవచ్చు
ఇష్యూలో కేటాయించిన అన్ని వాటాలు డీమ్యాట్‌ రూపంలో మాత్రమే ఉంటాయి
బేస్‌ ధర రూ.314తో స్టాక్‌ మార్కెట్లో ప్రత్యేకంగా ట్రేడ్‌కానున్న షేర్లు
2021 మార్చి నాటికి రిలయన్స్ సంస్థను రుణ రహిత సంస్థగా  మార్చనున్నట్టు ప్రకటించిన అధినేత ముకేశ్‌ అంబానీ