వరుసగా మూడో రోజూ కేంద్రం వరాలు... హైలైట్స్‌

వరుసగా మూడో రోజూ కేంద్రం వరాలు... హైలైట్స్‌
 • వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేంద్రం ప్యాకేజీ
 • రైతులు తమ ఉత్పత్తులను ఎక్కైడనా అమ్ముకునేలా చర్యలు
 • వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విధానంలో సంస్కరణలు
 • రైతులకు సరైన ధరలు ఇచ్చే విధంగా చట్టంలో సవరణలు 
 • నిత్యావసర వస్తువుల చట్టం 1955 కు సవరణలు  
 • ఆరు నెలల తర్వాత ఈ పథకం విస్తరణతో పాటు పొడగింపు 
 • టాప్ టు టోటల్‌ పేరుతో ఆరు నెలల పాటు ప్రోత్సాహక కార్యక్రమం 
 • కూరగాయల ఉత్పత్తికి ప్రోత్సాహం అందించేందుకు రూ. 500 కోట్లు 
 • దీనివల్ల లభించే మైనం అనేక రంగాల్లో ఉపయోగపడుతుంది 
 • దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది
 • తేనెటీగల పెంపకానికి రూ. 500 కోట్లు కేటాయింపు 
 • గంగా పరివాహక ప్రాంతంలో 800 హెక్టార్లలో ఔషధ మొక్కల సాగు 
 • ఔషధ మొక్కలతో రైతులకు దాదాపు రూ. 5 వేల కోట్ల ఆదాయం వస్తుంది.
 • ఔషధ మొక్కల పెంపకానికి రూ. 4 వేల కోట్లు కేటాయింపు 
 • పాడి పరిశ్రమ మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు 
 • పశువుల వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి రూ. 13, 343 కోట్లు 
 • దీనివల్ల పశువులు ఆరోగ్యంగా తయారై పాడి ఉత్పత్తి పెరుగుతుంది 
 • మొత్తం 53 కోట్ల పశువులకు వ్యాక్సిన్లు చేయించేలా కార్యక్రమం 
 • దేశవ్యాప్తంగా అన్ని పశువులకు వంద శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం 
 • మెరైన్‌ యాక్టివిటీస్‌కు రూ. 11 వేల కోట్లు, మౌలిక వసతులకు రూ. 9 వేల కోట్లు 
 • వచ్చే ఐదేళ్లలో 70 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు పెరుగుతాయి 
 • మత్స్య పరిశ్రమ నుంచి లక్ష కోట్ల ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నాం
 • దీనివల్ల 55 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నాం 
 • మత్స్య సంపద యోజన అభివృద్ధికి రూ.  20 వేల కోట్లు 
 • తెలంగాణ పసుపు, ఆంధ్రలో మిర్చీ క్లస్టర్లుగా ఏర్పాటు చేయవచ్చన్న నిర్మల 
 • ఆయా రాష్ట్రాల్లో లభించే ఆర్గానిక్‌ ఉత్పత్తులతో క్లస్టర్లుగా అభివృద్ధి చేయవచ్చు  
 • మైక్రో ఫామ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అభివృద్ధికి ఈ నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది 
 • ఆహార అనుబంధ రంగానికి రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నాం 
 • విపత్తుల నుంచి రైతులు బయటపడేందుకు ఈ నిధిని ఉపయోగిస్తాం 
 • ఈ ప్రత్యేక ఫండ్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తాం 
 • మౌలిక వసతుల కల్పన కోసం వ్యవస్థాయ సంస్థలకు రూ. లక్ష కోట్లు 
 • కోళ్ల పరిశ్రమల అనుమతులను మూడునెలలు పొడగించాం 
 • లాక్‌డౌన్‌ సమయంలో పాల డిమాండ్‌ 25 శాతం తగ్గింది 
 • పీఎం కిసాన్‌ పథకం కింద రూ.18,700 కోట్లు గత రెండు నెలల్లో ఇచ్చాం 
 • రైతులకు రూ.6,400 కోట్ల బీమా క్లెయిములు క్లియర్‌ చేశాము 
 • లాక్‌డౌన్‌ సమయంలో రూ.74,300 కోట్ల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి 
 • ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్‌ మొదటి‌ స్థానంలో ఉంది - నిర్మలా సీతారామన్‌
 • మత్స్య, పాల ఉత్పత్తులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు ప్రత్యేక ప్యాకేజీ 
 • ఇందులో 8 కార్యక్రమాలు మౌలిక వసతులకు సంబంధించినవి
 • వ్యవసాయ అనుబంధ రంగాల మెరుగుదలకు 11 కార్యక్రమాలు