నిర్మలా సీతారామన్‌ ప్యాకేజీ ప్రకటన హైలైట్స్‌..

నిర్మలా సీతారామన్‌ ప్యాకేజీ ప్రకటన హైలైట్స్‌..
 • విస్తృత సంప్రదింపుల తర్వాతే ప్యాకేజీ ప్రకటన
 • ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటే.. స్వయం ఆధారిత భారత్‌ అని
 • ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఐదు అంశాలు ప్రధానమైనవి...
 • ప్రపంచ స్థాయికి స్వదేశీ బ్రాండ్స్-నిర్మలా
 • పీపీఈలు, వెంటిలేటర్ల తయారీ భారీగా పెరిగింది..
 • ఆర్థిక, మౌలిక, సాంకేతిక రంగాలపై దృష్టి
 • 5 పిల్లర్లపై స్వయం ఆధారిత భారత్ నిర్మాణం-నిర్మల
 • భూమి, కార్మికులు, నగదు లభ్యత, చట్టాలకు ప్రాధాన్యం 
 • ప్రస్తుత సంక్షోభం మనకు మహత్తర అవకాశంగా మారబోతోంది
 • స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి కల్పిస్తాం
 • రైతుల అభివృద్ధి కోసం సంస్కరణలు తెచ్చాం
 • గత మూడు నెలలుగా పేదలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం
 • నవ భారత నిర్మాణానికి ఈ ప్యాకేజీ తోడ్పడుతుంది
 • దేశాభివృద్ధికి ఈ ప్యాకేజీ తోడ్పడుతుంది
 • ఐటీ పేయర్స్‌కు రూ.18000 కోట్లు రీఫండ్‌ చేశాం
 • ఇవాళ్టి నుంచి కొన్ని రోజుల పాటు అన్ని వివరాలు వెల్లడిస్తాం
 • లాక్‌డౌన్‌ తర్వాత గరీబ్ కళ్యాణ్‌ ప్యాకేజ్ ఇచ్చాం
 • ఫిబ్రవరిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టాక కరోనా వచ్చింది
 • 45 లక్షల MSME యూనిట్లకు ప్రయోజనం
 • MSME లోన్లకు ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు
 • 12 నెలల మారటోరియం, 100 శాతం క్రెడిట్ గ్యారెంటీ
 • MSMEలకు రూ.25 కోట్లు మేర ఔట్‌స్టాండింగ్‌ లోన్లు
 • MSMEలకు రూ.3లక్షల కోట్ల రుణ సౌకర్యం
 • ఈ పథకంలో 2 లక్షల కంపెనీలకు ప్రయోజనం
 • క్లిష్ట పరిస్థితుల్లోని MSME కోసం 20వేల కోట్ల రుణం 
 • వాటి కోసం క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్‌ ఏర్పాటు
 • క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న MSMEలకు ఈక్విటీ సమస్య లేకుండా చూస్తాం
 • 10వేల కోట్ల కార్పస్‌తో ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ ఏర్పాటు
 • ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ ద్వారా రూ.50వేల కోట్ల ఈక్విటీ సమకూరుస్తాం
 • MSMEలు ఈక్విటీ కొరత ఎదుర్కొంటున్నాయి
 • 20 కోట్ల వరకు పెట్టుబడి, 100 కోట్ల టర్నోవర్‌ కలిగినవి మీడియం పరిశ్రమలు
 • 10 కోట్ల వరకు పెట్టుబడి, 50 కోట్ల వరకు టర్నోవర్‌ కలిగినవి స్మాల్‌ ఇండస్ట్రీలు
 • కోటి కంటే తక్కువ పెట్టుబడి, 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉండే మైక్రో విభాగంలోని సంస్థ
 • ఆ రెండు రంగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ నిర్ణయం
 • ఇప్పటివరకు ఉత్పత్తి, సేవల రంగానికి వేర్వేరుగా నిబంధనలు
 • ఇందుకు అవసరమైన చట్ట సవరణ చేపడతాం
 • MSME నిర్వచనం మార్పు ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్..
 • కొత్త నిర్వచనంతో ఎక్కువ కంపెనీలకు లబ్ది
 • మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌-MSME నిర్వచనం మార్పు
 • MSMEల వ్యాపారం పెరగడానికి ఇది దోహదం చేస్తుంది
 • స్వయం ఆధారిత భారత్‌కు ఈ నిర్ణయం కీలకం
 • జనరల్ ఫైనాన్షియల్ రూల్స్‌కు సవరణలు చేస్తాం
 • 200 కోట్లు విలువైన పనులకు గ్లోబల్‌ టెండర్లు పిలవం
 • 100 మంది లోపు ఉద్యోగులుండి, 90 శాతం ఇంటి నుంచి పనిచేస్తూ.. 15వేల లోపు జీతం కలిగినవారికి లబ్ది
 • ఇందుకోసం రూ.2500 కోట్లు కేటాయింపు
 • 72.22 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం
 • 3.6 లక్షల కోట్ల కంపెనీలకు ప్రయోజనం
 • మార్చి, ఏప్రిల్, మే వరకు ఉన్న సౌకర్యం మరో 3 నెలలు పొడిగింపు
 • చిన్న సంస్థల ఉద్యోగుల EPF వాటా చెల్లింపుల్లో వెసులుబాటు
 • MSMEలకు ప్రభుత్వ చెల్లింపుల్ని 45 రోజుల్లో పూర్తి చేస్తాం
 • చిన్న సంస్థలకు కేంద్రం భారీ ఊరట
 • అక్టోబర్ వరకు MSMEలకు రుణ సదుపాయం
 • NBFCల పార్షియల్‌ క్రెడిట్‌ గ్యారెంటీ పథకానికి 45వేల కోట్లు
 • NBFCలకు లిక్విడిటీ గ్యారెంటీ పథకం
 • ప్రభుత్వ రంగ సంస్థలకు 45 రోజుల్లో పేమెంట్
 • NBFCలకు 3వేల కోట్ల ప్రయోజనం
 • MSMEలు ఇ-మార్కెట్‌కు అనుసంధానం చేస్తాం 
 • డిస్కంలకు కేంద్ర సంస్థల నుంచి రిబేట్ ఇస్తాం.. దాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలి
 • జెన్కోలకు చెల్లింపుల్లో స్టేట్ గ్యారంటీలపై రుణాలు
 • విద్యుత్ డిమాండ్ తగ్గడంతో డిస్కంల రాబడి తగ్గింది
 • ఇది వన్‌టైమ్‌ పథకం
 • కష్టాల్లోని డిస్కంలకు భారీ ఊరట
 • విద్యుత్‌ పంపిణీ కంపెనీలకు రూ.90వేల కోట్ల నగదు లభ్యత
 • ఫలితంగా కాంట్రాక్టర్లకు నగదు లభ్యత సమస్య రాదు..
 • కాంట్రాక్టర్ల బ్యాంకు గ్యారెంటీలు పాక్షికంగా విడుదల
 • రైల్వే, రవాణా, హైవే ప్రాజెక్టులు చేస్తున్న కాంట్రాక్టర్లకు లబ్ది
 • పనులు ముగించేందుకు 6 నెలలు గడువు పొడిగింపు
 • ప్రభుత్వ సంస్థల కాంట్రాక్టర్లకు ఊరట
 • పొడిగింపు కాలానికి అపరాధ రుసుము ఉండదు
 • మార్చి 25లోగా పూర్తి చేయాల్సిన గడువు పొడిగింపు
 • రెరా పరిధిలోని నిర్మాణ సంస్థలకు లబ్ది
 • రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట 
 • కాంట్రాక్టుల పేమెంట్లు, ప్రొఫెషనల్ ఫీజు, అద్దెలు, డివిడెండ్లు, కమీషన్, బ్రోకరేజీ వంటి వాటికి వర్తింపు
 • 50వేల కోట్ల లబ్ది కలిగిస్తున్నాం
 • మార్చి 2021 వరకు కొనసాగుతుంది
 • ఈ కోత అన్ని రంగాలకు వర్తింపు
 • TDS/TCSలో 25 శాతం కోత
 • వివాద్‌ పే విశ్వాస్‌ స్కీం డిసెంబర్‌ 31 వరకు పొడిగింపు
 • ట్యాక్స్‌ ఆడిట్‌ గడువు అక్టోబర్ 31కి పొడిగింపు
 • ఐటీ రిటన్స్ ఫైలింగ్‌ గడువు నవంబర్‌ 30కి పొడిగింపు
 • 14 లక్షల మందికి ప్రయోజనం
 • పెండింగ్‌లోని రూ.5 లక్షల్లోపు రీఫండ్స్‌ వెంటనే విడుదల
 • ఎమర్జెన్సీ హెల్త్ రెస్పాన్స్ ప్యాకేజీకి 15వేల కోట్లు