లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రధాని మోదీ వీడియో సందేశం హైలైట్స్..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రధాని మోదీ వీడియో సందేశం హైలైట్స్..
 • లాక్‌డౌన్‌ సమర్థంగా అమలవుతోందన్న మోదీ
 • సంయమనం పాటించిన ప్రజలందరికీ మోదీ అభినందన
 • ఏప్రిల్‌ 5 వ తేదీన అందరం కలిసి కరోనా చీకట్లను సవాల్‌ చేయాలి 
 • ఈ స్పూర్తిని నలు దిశలా వ్యాపింపజేయాలి 
 • ఈ ఆదివారం అందరం కలిసి సామూహిక శక్తి ప్రకాశాన్ని కరోనాకు చూపించాలి 
 • ఏప్రిల్‌ 5 వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు మీ అందరు 9 నిముషాలు కేటాయించాలి
 • అందరూ లైట్లు ఆర్పేసి... ఇళ్ల గుమ్మాల్లో దీపాలు వెలిగించాలి 
 • దీపాలు గానీ, క్యాండిళ్లు గానీ, టార్చ్‌ గానీ, మొబైల్ ఫ్లాష్‌ లైట్ వెలిగించాలి
 • అందరూ ఒక్కో దీపం వెలిగిస్తే ప్రకాశానికున్న శక్తి ఏంటో అందరికీ తెలుస్తుంది 
 • మనం ఒంటరిగా లేమనే విషయాన్ని ఆ వెలుగులే చాటి చెబుతాయి 
 • ఈ కార్యక్రమంలో మనందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది 
 • ఈ దీపాలు వెలిగించే సమయంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలి 
 • దేశంలోని 130 కోట్ల మంది ఒకటే సంకల్పంతో ఉన్నారని చాటగలుగుతాము 
 • కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైన పేదల్లో ధైర్యం నింపాలి 
 • కరోనా వల్ల ఏర్పడిన చీకటి నుంచి మనం వెలుగు వైపు పయనించాలి 
 • లక్ష్యాన్ని సాధించే శక్తిని మనకు ప్రసాదిస్తుంది 
 • ఈ విశ్వాసం మనకు ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది 
 • ప్రజలు దైవ స్వరూపమని మన దేశంలో నమ్ముతాము 
 • మనందరి సామూహిక శక్తితోనే కరోనాపై పోరాటం చేస్తున్నామని గుర్తించాలి 
 • కానీ మనం ఒంటరిగా లేమని... ఒకరికొకరు తోడుగా ఉన్నామని గుర్తించాలి 
 • ఇళ్లలోనే ఇలా ఇంకెన్ని రోజులు గడపాలని చాలా మంది భావించారు 
 • మనం ఒక్కరమే ఏం చేయగలమని ప్రతి ఒక్కరు ఆలోచించారు 
 • దేశంలో ఇప్పుడు కోట్లాది మంది ఇంటికే పరిమితమయ్యారు 
 • మన పోరాటం సఫలం చెందే సమయం ఆసన్నమైంది 
 • కరోనాకు వ్యతిరేకంగా దేశమంతా కలిసి పోరాడగలుగుతుందని చాటి చెప్పాం 
 • ప్రజల సామూహిక శక్తి ఏంటో మనం ప్రపంచానికి చాటి చెప్పాం 
 • ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మనబాటలోనే పయనిస్తున్నాయి 
 • ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేస్తున్నాయి