మార్కెట్లకు రుచించని ఆర్బీఐ డెసిషన్స్

మార్కెట్లకు రుచించని ఆర్బీఐ డెసిషన్స్

భారీగా లిక్విడిటీ పెంచే విధంగా, సామాన్యులకు ఊరట కలిగించే విధంగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు...  స్టాక్ మార్కెట్లకు మాత్రం అంతగా రుచించలేదు. ఇవాళ ఉదయం నుంచి భారీ లాభాల్లో ఉన్న మన మార్కెట్లు.. ఎంపీసీ నిర్ణయాల ప్రకటన అనంతరం.. లాభాలను పూర్తిగా పోగొట్టుకున్నాయి. అన్ని సెక్టార్ల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. వెయ్యి పాయింట్ల లాభం నుచి సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంలోకి జారుకుంది. నిఫ్టీ కూడా గరిష్ట స్థాయి నుంచి దాదాపు 375 పాయింట్లు దిగివచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 29750 వద్ద ఉండగా.. 12 పాయింట్ల లాభంలో ఉన్న నిఫ్టీ 8654 దగ్గర ట్రేడవుతోంది. గరిష్ట స్థాయి నుంచి 1000 పాయింట్లు పడిపోయిన బ్యాంక్ నిఫ్టీ.. ప్రస్తుతం 514 పాయింట్ల లాభంతో 20128 దగ్గర నిలిచింది. ఇక నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, సిప్లా, కోల్ ఇండియా, యస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ గెయినర్స్‌గా ఉండగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటోకార్ప్, భారతి ఎయిర్‌టెల్, మారుతి సుజుకి, గెయిల్ టాప్ లూజర్స్‌గా ట్రేడవుతున్నాయి.