ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్బీఐ చర్యలు భేష్

ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్బీఐ చర్యలు భేష్

కరోనావైరస్‌పై పోరాటంలో సామాన్యులతో ఆర్బీఐ చేతులు కలిపిందిరెపో రేటు, రివర్స్ రెపో రేటుతో పాటు.. CRR, MSFలను కూడా తగ్గిస్తూ.. ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థలోకి 3.74 లక్షల కోట్ల రూపాయల నగదు లభ్యత పెరగనుంది. ఒకవేళ అవసరం అయితే.. సాంప్రదాయేతర పద్ధతులు అవలంబించడం ద్వారా మరిన్ని చర్యలు కూడా తీసుకునేందుకు సిద్ధం అంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించడం విశేషంగా చెప్పుకోవాలి. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తీసుకు వచ్చేందుకు.. ఎకానమీని గాడిలో పెట్టేందుకు.. ప్రస్తుత బలహీన సెంటిమెంట్‌పై పోరాటానికి ఆర్బీఐ చేపట్టిన చర్యలను ఎకానమిస్ట్‌లు ప్రశంసిస్తున్నారు