కరోనాపై ఫైట్‌లో ఆర్బీఐ చేయూత

కరోనాపై ఫైట్‌లో ఆర్బీఐ చేయూత

ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో సామాన్యులకు గృహ, వాహన రుణాలతో పాటు అన్ని రకాల ఈఎంఐల భారం నుంచి ఊరట దక్కనుంది. మార్చ్ 1 నుంచి ఈ మారటోరియం నిర్ణయాన్ని వర్తింపచేయడంతో.. మార్చ్ 1 నుంచి చెల్లించాల్సిన రుణాలను ఒకవేళ చెల్లించలేకపోయినా.. వీటిని డీఫాల్ట్‌గా పరిగణించరు. సామాన్యులతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలకు కూడా ఈ నిర్ణయం ఎంతో రిలీఫ్ అందించనుంది. లాక్‌డౌన్ కారణంగా వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోవడంతో..  కంపెనీలకు ఆదాయ వనరులు లేకుండా పోయాయి. ఇలాంటి సమయంలో ఆర్బీఐ ఈఎంఐల నుంచి ఊరట కల్పించడం.. బోల్డ్ స్టెప్‌గా ఆర్థికవేత్తలు చెబుతున్నారు.