EMIలపై ఆర్బీఐ కీలక నిర్ణయం

EMIలపై ఆర్బీఐ కీలక నిర్ణయం

కరోనా ఎఫెక్ట్‌తో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, రుణాలు జారీ చేసే సంస్థలకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గృహ రుణాలతో సహా అన్ని రకాల లోన్‌లపై 3 నెలల మారటోరియం విధించింది. సహకార రుణాలపై కూడా మారటోరియంను అమలు చేసింది. ఆర్‌బీఐ నిర్ణయంతో ఇప్పుడు కట్టాల్సిన రుణాలను గడువు తర్వాత ఎప్పుడైనా చెల్లించవచ్చు. రాబోయే 3 నెలలు ఈఎంఐలు చెల్లించకపోయినా పర్వాలేదని  ఆర్బీఐ తెలిపింది. ఎన్‌పీఏలుగా పరిగణించరాదని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది.  దీనివల్ల రుణగ్రహీతల క్రెడిట్‌ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలియజేశారు.