కీలక వడ్డీ రేట్ల తగ్గింపు

కీలక వడ్డీ రేట్ల తగ్గింపు

కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. 3రోజుల పాటు జరిగిన ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో 4-2 ఓట్ల తేడాతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు  4.40శాతానికి, 90 బేసిస్‌ పాయింట్ల తగ్గింపుతో రివర్స్‌ రెపో రేటు 4శాతానికి  దిగివచ్చాయి. సోషల్ డిస్టెన్సింగ్ కారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం లేదని, అసాధారణ పరిస్థితులలో చేస్తున్న ప్రకటన ఇదని ఆర్‌బీఐ గవర్నర్‌  ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. వృద్ధి రేటుకు ప్రోత్సాహం, అలాగే కరోనావైరస్ ప్రభావాన్ని నియంత్రించడం కోసం  భారీగా పాలసీ రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.