1400 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

1400 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను గడించాయి. ఇవాళ ట్రేడింగ్ ఆరంభం నుంచి పాజిటివ్‌గా ఉన్న మన ఇండెక్స్‌లు... క్రమంగా లాభాలను పెంచుకున్నాయి. మిడ్ సెషన్ సమయానికి ఇండెక్స్‌లు భారీ లాభాల్లోకి చేరుకున్నాయి.

అయితే, కేంద్రం అందించే కరోనా వైరస్ స్పెషల్ స్టిమ్యులస్ ప్యాకేజ్‌పై అనేక అంచనాలతో భారీ లాభాలు గడించిన మార్కెట్లు..  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ అంత ఆశాజనకంగా లేకపోవడంతో.. కొంతమేర హైయర్ లెవెల్ నుంచి దిగి వచ్చాయి.

క్రమంగా లోయర్ లెవెల్స్‌లో కొనుగోళ్లు పెరగడంతో.. తిరిగి మార్కెట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ట్రేడింగ్ చివరకు సెన్సెక్స్ 1411 పాయింట్ల లాభంతో 29946 వద్ద ముగియగా..  335 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 8653 వద్ద క్లోజయింది. 1175 పాయింట్లు లాభపడిన బ్యాంక్ నిఫ్టీ 19656 వద్ద క్లోజైంది.

అన్ని సెక్టోరియల్ సూచీలు పాజిటివ్‌గా ముగియగా.. కేపిటల్ గూడ్స్ రంగం భారీగా పెరిగింది.

నిఫ్టీలో ఇండస్ఇండ్ బ్యాంక్ 46 శాతం లాభంతో హైయెస్ట్ గెయినర్‌గా ఉండగా ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. యస్ బ్యాంక్, గెయిల్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అదాని పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా ట్రేడింగ్ ముగించుకున్నాయి.