ట్రేడింగ్‌ సమయం తగ్గింపు... ఎప్పటి నుంచి అంటే?

ట్రేడింగ్‌ సమయం తగ్గింపు... ఎప్పటి నుంచి అంటే?

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఎక్స్‌), ఇండియన్‌ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌(ICEX) ట్రేడింగ్‌ సమయాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కమోడిటీ ట్రేడింగ్‌ కేవలం 8 గంటలే జరగనుంది. ఈనెల 30 నుంచి ఏప్రిల్‌ 14 వరకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే జరగనుందని ఎంసీఎక్స్‌, ఐసీఈఎక్స్‌ వెల్లడించాయి. 

ప్రస్తుతం ఉదయం 9గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు కమోడిటీ ట్రేడింగ్‌ జరుగుతోంది. తొలి 15 నిమిషాలు జీటీసీ/జీటీడీ చెల్లుబాటు ఆర్డర్స్‌ రద్దు కోసం ప్రి-ఓపెన్‌ సెషన్‌ నిర్వహిస్తారు. అలాగే చివరి 15 నిమిషాలు అంటే రాత్రి 11:30 నుంచి 11:45 వరకు క్లోజింగ్‌ సెషన్‌ నిర్వహిస్తారు. ఈ రెండు సెషన్‌ కూడా ఉదయం 9 గంటల నుంచి 9:45 నిమిషాల వరకు, సాయంత్రం 4:45 నిమిషాల నుంచి 5గంటల వరకు యథావిధిగా నిర్వహించనున్నారు. సవరించిన సమయం మార్చి 30 నుంచి అమల్లోకి రానుంది.