మార్కెట్లకు నచ్చని నిర్మలా ప్యాకేజ్..

మార్కెట్లకు నచ్చని నిర్మలా ప్యాకేజ్..

కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ మార్కెట్లను మెప్పించలేకపోయాయి. ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఇన్వెస్టర్లను  నిరాశపరుస్తూ... తాజాగా ప్రకటిస్తోన్న ప్యాకేజీ మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్యాకేజీ ప్రకటిస్తోన్న సమయంలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆరంభ లాభాలు కరిగిపోయాయి. మార్నింగ్‌ సెషన్‌లో భారీ లాభాల్లో కదలాడిన సూచీలు ప్రస్తుతం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 800 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో ట్రేడవుతోన్నాయి.  

ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 33.62శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 10.76 శాతం, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 8.03శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 7.69 శాతం, యూపీఎల్‌ 7.24శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. యెస్‌ బ్యాంక్‌ 6.08 శాతం, మారుతీ సుజుకీ 4.18 శాతం, అదానీ పోర్ట్స్‌ 4.03శాతం, గెయిల్‌ 3.71శాతం, ఎన్టీపీసీ 2.63శాత నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.