జోరుమీదున్న జేకే టైర్

జోరుమీదున్న జేకే టైర్

అనుబంధ సంస్థలో వాటాను పెంచుకోనుండటంతో జేకే టైర్స్‌ వరుసగా రెండోరోజూ జోరుమీదుంది. ఇంట్రాడేలో షేర్‌ 10శాతం అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద లాకైంది. ప్రస్తుతం అప్పర్‌ సర్క్యూట్‌ రూ.38.90 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. మధ్యాహ్నం 1:08 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి 4.88 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. గతకొంతకాలం నుంచి డౌన్‌ట్రెండ్‌లో ఉన్న జేకే టైర్స్‌ మంగళవారం రోజు 52 వారాల కనిష్ట స్థాయి రూ.31.90కు పడిపోయిది. లోయర్‌ లెవల్స్‌లో కొనుగోళ్ళ మద్దతు లభించడంతో గత రెండు రోజుల్లో షేర్‌ 20శాతం పైగా లాభపడింది. 

తమ అనుబంధ సంస్థ కావెన్‌డిష్‌ ఇండస్ట్రీస్‌లో వాటాను 69 శాతం నుంచి 71.91 శాతానికి వాటాను పెంచుకోవడానికి జేకే టైర్స్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయానికి రెగ్యులేటరీ/గవర్నమెంట్‌ అనుమతి లభించాల్సి ఉంది. వచ్చే 15 రోజుల్లో అన్ని అనుమతులు లభించవచ్చని జేకే టైర్స్‌ అంచనా వేస్తోంది.