అప్పర్‌ సర్క్యూట్‌కు అశోక్‌ లేలాండ్ 

అప్పర్‌ సర్క్యూట్‌కు అశోక్‌ లేలాండ్ 

హిందూజా లేలాండ్‌ ఫైనాన్స్‌లో వాటాను పెంచుకోవడంతో అశోక్‌ లేలాండ్‌కు ఇవాళ ఫుల్‌ జోష్‌నిచ్చింది. ఇంట్రాడేలో షేర్‌ అప్పర్‌ సర్క్యూట్‌(రూ.43.05) వద్ద లాకైంది. ప్రస్తుతం 17శాతం లాభంతో రూ.40.30 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. హిందూజా లేలాండ్‌లో 1,70,17,995 షేర్లను రూ,10 చొప్పున అశోక్‌ లేలాండ్‌ కొనుగోలు చేసింది. తాజా కొనుగోలుతో వాటా 3.62శాతం పెరిగింది. ప్రస్తుతం హిందూజా లేలాండ్‌ ఫైనాన్స్‌లో అశోక్‌ లేలాండ్‌ వాటా 61.83 శాతం నుంచి 65.45శాతానికి పెరిగింది. 

మరోవైపు అశోక్ లేలాండ్‌  లాంగ్‌టర్మ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ రేటింగ్‌ను 'ICRA AA+' నుంచి 'ICRA AA(Negative)'కు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఇక అశోక్‌ లేలాండ్‌ ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10,553.22 కోట్లకు చేరింది. కంపెనీ పీ/ఈ11.08, బుక్‌ వేల్యూ రూ.28.38, ఈపీఎస్‌ 3.24గా ఉంది.