స్టిమ్యులస్ ఆశలు.. ఇండస్ఇండ్ బ్యాంక్‌ రీబౌండ్‌..

స్టిమ్యులస్ ఆశలు.. ఇండస్ఇండ్ బ్యాంక్‌ రీబౌండ్‌..

యెస్‌ బ్యాంక్‌ సంక్షోభంతో గత కొంతకాలం నుంచి నేలచూపులు చూస్తోన్న ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఎట్టకేలకు లాభాల బాటలోకి మళ్ళింది. ఇవాళ ఒక్కరోజే షేర్‌ దాదాపు 50శాతం పెరిగింది. ఇంట్రాడేలో షేర్‌ రూ.451.80కి చేరి ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తింది. కరోనా వైరస్‌ విజృంభించడంతో ఈ నెల్లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 64.5 శాతం నష్టపోయింది. కంపెనీ ఎండీ, సీఈఓ రోమేశ్‌ సోబ్తి రిటైర్‌మెంట్‌ తర్వాత బ్యాంక్‌ 30 శాతం పైగా నష్టపోయి 8 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. 

యూరోపియన్‌ గ్రోత్‌ ఫండ్‌ భారీగా షేర్లను విక్రయించడం ఈ కౌంటర్‌కు జోష్‌నిచ్చింది. మార్చి 25న యూరోపియన్‌ గ్రోత్‌ ఫండ్‌ 35.8 లక్షల షేర్లను ఒక్కో షేరు రూ.298.83 చొప్పున బల్క్‌డీల్‌లో విక్రయించింది. ప్రస్తుతం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 47శాతం లాభంతో రూ.441.50 వద్ద ట్రేడవుతోంది. మధ్యాహ్నం 12:35 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 2.30 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇక కంపెనీ ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.27,772.64 కోట్లకు చేరింది. కంపెనీ పీ/ఈ 6.19, బుక్‌ వేల్యూ రూ.381.24, ఈపీఎస్‌ 64.54గా ఉంది.