ఫైనాన్షియల్ స్టాక్స్.. TV5 చెప్పిందే నిజమైంది..

ఫైనాన్షియల్ స్టాక్స్.. TV5 చెప్పిందే నిజమైంది..

మార్కెట్లు కొన్ని వారాలుగా భారీగా పతనం అవుతున్నాయి. అడపాదడపా రికవరీ కనిపించినా తర్వాత మళ్లీ ఆయా స్టాక్స్‌లో భారీగా కరెక్షన్ వచ్చింది. ఇలాంటి సమయంలో ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి.. పెట్టుబడులను స్విచ్ చేయాలంటే ఏ రంగం వైపు చూడాలని అనే అంశంపై అందరిలోనూ సందిగ్ధాలు, అనుమానాలు నెలకొన్నాయి.

మార్కెట్లు ఇంతగా ఒడిదుడుకులకు లోనవుతున్నా.. ఫైనాన్షియల్ స్టాక్స్‌లో పెట్టుబడులు ఇప్పుడు మంచి రాబడులు ఇస్తాయని కొన్ని రోజులుగా టీవీ5 ఎనలిస్ట్ ప్యానెల్ చెబుతూనే ఉంది. 

ప్రస్తుతం మార్కెట్ పతనంలో ఫైనాన్షియల్ స్టాక్స్ అత్యధికంగా పతనం అయినా సరే.. ఆ రంగానికి చెందిన స్టాక్స్‌లో అయితే రాబడులు బాగుంటాయని.. మొత్తం టీవీ5 ఎనలిస్ట్ టీం అంతా చెబుతూనే ఉన్నారు.

ఇప్పుడు అదే నిజమవుతోంది. మార్కెట్లలో కొంతమేర రికవరీ రాగానే ఇప్పుడు ఆ రంగానికి చెందిన స్టాక్స్ దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకింగ్ రంగం అయితే.. భారీగా లాభాలను గడిస్తోంది.

ఇవాల్టి ట్రేడింగ్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్ ఏకంగా 45 శాతం లాభాలను గడించడం మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం కాగా.. ఇతర ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లు కూడా ఇదే బాటలో ఉన్నాయి.

ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంక్ 40 శాతం, బంధన్ బ్యాంక్ 27.5 శాతం, యాక్సిస్ బ్యాంక్ 10 శాతం, ఐసీఐసీఐ  బ్యాంక్ 7.3 శాతం, ఫెడరల్ బ్యాంక్ 6.7 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 6 శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ 1 శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి.