సిప్లాకు యూఎస్‌ఎఫ్‌డీఏ బూస్టింగ్‌

సిప్లాకు యూఎస్‌ఎఫ్‌డీఏ బూస్టింగ్‌

కొత్త ఔషధం ఇసొమెప్రజోల్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తుది అనుమతిని భారత ఔషధ తయారీ కంపెనీ సిప్లా సంపాదించింది. ఈ ఔషధం 10 ఎంజీ విభాగంలో యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతి పొందిన తొలి కంపెనీ సిప్లా కావడం విశేషం. ఇసొమెప్రజోల్‌ ఔషధాన్ని 10 ఎంజీ, 20ఎంజీ, 40 ఎంజీలో కంపెనీ తయారు చేస్తోంది. ఆస్ట్రాజెనికా ఫార్మాకు చెందిన నెక్సియమ్‌ ఔషధానికి ఇది జెనరిక్‌ వెర్షన్‌. గత ఏడాది నవంబర్‌ వరకు 12 నెలల కాలంలో 70 మిలియన్‌ డాలర్ల నెక్సియమ్‌ ఔషధం అమ్ముడైంది. యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతితో ప్రస్తుతం ఈ ఔషధం షిప్పింగ్‌కు తక్షణమే అందుబాటులో ఉందని సిప్లా ప్రకటించింది. 

యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు రావడంతో ఇంట్రాడేలో షేర్‌ 3 శాతం పైగా లాభపడి రూ389కు చేరింది. ప్రస్తుతం షేర్‌ 2శాతం లాభంతో రూ.383.60 వద్ద ట్రేడవుతోంది.  ఉదయం 10:13 నిమిషాల సమయానికి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 10 లక్షల షేర్లు అమ్ముడయ్యాయి. కంపెనీ ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే మార్కెట్ క్యాప్‌ రూ.30,378.88 కోట్లుగా ఉంది. కంపెనీ పీ/ఈ 12.93, ఈపీఎస్‌ 29.12, బుక్‌ వేల్యూ రూ.195.75గా ఉంది.