అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద డెల్టా కార్ప్‌ లాక్‌

అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద డెల్టా కార్ప్‌ లాక్‌

కంపెనీ బోర్డు బైబ్యాక్‌ ప్రతిపాదనను పరిశీలిస్తుండటంతో ఇవాళ డెల్టా కార్ప్‌ అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద లాకైంది. ప్రస్తుం 2.16 లక్షల షేర్లు కొనుగోలు కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం 5 శాతం లాభంతో రూ.56.50 వద్ద షేర్‌ లాకైంది. ఉదయం 9:50 నిమిషాల వరకు ఎన్‌ఎస్‌ఈల్లో 33950 షేర్లు ట్రేడయ్యాయి. నిన్న 52వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన డెల్టా కార్ప్‌లో ఇవాళ షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. గత ఏడాది ఏప్రిల్ 3న డెల్టా కార్ప్‌ 52వారాల గరిష్ట స్థాయి (రూ.277.75)ను తాకింది. ప్రస్తుతం కంపెనీ షేర్‌ 52వారాల గరిష్టానికి 80 శాతం దిగువన ట్రేడవుతోంది. అలాగే 52వారాల కనిష్ట స్థాయికి 5శాతం ఎగువన కొనసాగుతోంది. 

ఈనెల 28న డెల్టా కార్ప్‌ బోర్డు మీటింగ్‌ జరగనుంది. ఈ సమావేశంలో బైబ్యాక్‌ ప్రతిపాదనలను బోర్డు డైరెక్టర్లు పరిశీలించి దానికి అనుమతించే అవకాశముంది. కరనా వైరస్‌ ఎఫెక్ట్‌తో గత కొంతకాలం నుంచి స్టాక్‌ మార్కెట్లు నీరసించడంతో పలు కంపెనీలు బైబ్యాక్‌కు రావాలని యోచిస్తున్నాయి. ప్రస్తుతం స్టాక్స్‌ అల్ట్రాక్టివ్‌ లెవల్స్‌లో ఉండటంతో తక్కువ ధరలనే కంపెనీలు షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని నిర్ణయించాయి.