ఇవాళ మార్చ్ F&O సిరీస్ క్లోజింగ్

ఇవాళ మార్చ్ F&O సిరీస్ క్లోజింగ్

ఇవాళ మార్చ్ ఎఫ్ అండ్ ఓ సిరీస్ క్లోజింగ్ కావడంతో.. మార్కెట్లలో షార్ట్ కవరింగ్ కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నా.. ప్రస్తుతం మన మార్కెట్లు లాభాలు గడిస్తున్నాయి.

ట్రేడింగ్ ఆరంభం నుంచి లాభాల్లో ఉన్న బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు అంతకంతకూ ప్రాఫిట్స్ పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 8466 వద్ద ఉండగా.. 567 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్  29102 వద్ద ట్రేడవుతోంది. 420 పాయింట్లు లాభపడిన బ్యాంక్ నిఫ్టీ 18901 దగ్గర ట్రేడవుతోంది.

పీఎస్ఈ మినహా అన్ని సెక్టోరియల్ సూచీలు పాజిటివ్‌గా ఉండగా ఐటీ, టెక్నాలజీ, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లోని షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువగా లభిస్తోంది.

ప్రస్తుతం నిఫ్టీలో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యూపీఎల్ టాప్ గెయినర్స్‌గా ఉండగా.. యస్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, మారుతి సుజుకి, ఓఎన్‌జీసీ, గ్రాసిం షేర్లు టాప్ లూజర్స్‌గా ట్రేడవుతున్నాయి.