కొనసాగుతోన్న రిలయన్స్‌ జోరు

కొనసాగుతోన్న రిలయన్స్‌ జోరు

వరుసగా రెండో రోజూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జోరు కొనసాగుతోంది. ఇవాళ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఒకటిన్నర లాభంతో రూ.1100 మార్కును అధిగమించింది. ఉదయం 9:20 నిమిషాలకు వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 10 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. రిలయన్స్‌ జియోలో 10 శాతం వాటాను కొనుగోలు చేయాలని ఫేస్‌బుక్‌ భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో గత 2 రోజుల్లో షేర్‌ విలువ దాదాపు 25శాతం పెరిగింది. 

ఈ నెలాఖరు వరకు జియోను పూర్తి రుణరహిత సంస్థగా నిలపాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగా సంస్థలో 10శాతం వాటాను 60 బిలియన్‌ డాలర్లకు అంటే భారతీయ కరెన్సీలో రూ.4.20 లక్షల కోట్లకు విక్రయించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కానీ, ఫేస్‌బుక్‌ కానీ ఇంకా స్పందించలేదు. 

ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్ క్యాప్‌ 6.85 లక్షల కోట్లుగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 11.74 కాగా, కంపెనీ పీ/ఈ 18.6గా ఉంది. కంపెనీ బుక్‌ వాల్యూ రూ.639.38 కాగా ఈపీఎస్‌ 58.18గా ఉంది.