కరోనా ఎఫెక్ట్‌ : స్టాక్‌ బ్రోకింగ్‌ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు

కరోనా ఎఫెక్ట్‌ : స్టాక్‌ బ్రోకింగ్‌ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు

కరోనా ఎఫెక్ట్‌తో స్టాక్‌ బ్రోకింగ్‌ సిబ్బంది రాకపోకలకు పోలీసులు అనుమతించడం లేదు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో పలు రాష్ట్రాల్లో పోలీసులు బ్రోకరేజీ సంస్థల సిబ్బందిని అడ్డుకుంటున్నారు. దీనిపై అసోసియేషన్‌ ఆఫ్‌ ఎక్స్ఛేంజ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా, కమోడిటీ మార్కెట్‌ పార్టిసిపెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాలు సెబీకి లేఖలు రాశాయి. తమ ఇబ్బందులపై సెబీ వెంటనే నిర్ణయం తీసుకోవాలని బ్రోకింగ్‌ కార్యకలాపాలు నిలిపివేయాల్సిందిగా చాలామంది కోరుతున్నారని ఆ సంఘాలు తమ లేఖలో వెల్లడించాయి. లేకుంటే స్టాక్‌ బ్రోకింగ్‌ కార్యకలాపాలను ఎమర్జెన్సీ విభాగంలో భాగంగా గుర్తించేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎక్స్ఛేంజీలను తాత్కాలికంగా నిలిపివేయాలని అసోసియేషన్‌ ఆఫ్‌ ఎక్స్ఛేంజ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా కోరుతోంది. 

Delivery Guys Carrying Orders Beaten Up Mercilessly By Police As ...

మరోవైపు స్టాక్‌ బ్రోకింగ్‌ సంఘాల అభ్యర్థన లేఖపై సెబీ స్పందించింది. స్టాక్‌ బ్రోకరేజీ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకూ, అడ్మినిస్ట్రేటర్లకూ సెబీ లేఖ రాసింది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్టాక్‌ మార్కెట్‌ అనుబంధ సంస్థలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయిస్తూ ఇచ్చిందని ఆ లేఖలో సెబీ ప్రస్తావించింది.