1900 పాయింట్లు లాభంతో సెన్సెక్స్

1900 పాయింట్లు లాభంతో సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. లోయర్ లెవెల్స్‌లో కొనుగోళ్లు పెరగడం, 2 ట్రిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజ్ రెస్క్యూ బిల్‌కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం పలకడం.. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలత నింపింది.

ఇవాళ స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మన మార్కెట్లు.. ఆ తర్వాత కొంతమేర నష్టాల్లోకి జారుకున్నా ఆ తర్వాత భారీగా పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1900 పాయింట్ల లాభంతో 28574 వద్ద నిలవగా.. 517 పాయింట్లు పెరిగిన నిఫ్టీ  8318 వద్ద ట్రేడవుతోంది. 1282 పాయింట్లు పాయింట్లు లాభపడిన బ్యాంక్ నిఫ్టీ 18389 వద్ద ట్రేడవుతోంది.

అన్ని సెక్టోరియల్ సూచీలు పాజిటివ్‌గా ఉండగా.. ఐటీ, ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ రంగాలు 4 శాతం పైగా లాభాలను గడిస్తున్నాయి. హెల్త్‌కేర్ మాత్రం స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంటోంది.

నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, గ్రాసిం, యూపీఎల్, మారుతి సుజుకి టాప్ గెయినర్స్‌గా ఉండగా.. యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐటీసీ షేర్లు టాప్ లూజర్స్‌గా ట్రేడవుతున్నాయి.